పళ్ళ సమస్యల నివారణకు పళ్ళ పొడి (tooth powder for prevention of teeth problems)

prevention of teeth problems

పళ్ళ సమస్యల నివారణకు పళ్ళ పొడి 

కావలసిన పదార్ధములు :- తానికాయ బెరడు పొడి, కరక్కాయ బెరడు పొడి, తుమ్మ కాయల బెరడుపొడి, పొంగించిన పటికపొడి, ఎర్రమట్టి, లవంగాలపొడి, హారతి కర్పూరం, సైన్ధవలవణం, తెల్ల మిరియాల పొడి, అక్కలకర్ర పొడి, మంజిష్ఠ పొడి, పిప్పరమెంట్ ఆయిల్ లేదా స్పటికాలు.

తయారుచేయు విధానం :- తానికాయ బెరడు పొడి, కరక్కాయ బెరడు పొడి, తుమ్మ కాయల బెరడుపొడి, పొంగించిన పటికపొడి, ఎర్రమట్టి వీటి నన్నిటిని ఒక్కొక్కటి 20గ్రాముల  చొప్పున తీసుకొని వస్త్రగాలితం పట్టి కలుపుకొనవలెను. దీనికి లవంగాలపొడి 15గ్రాములు, హారతి కర్పూరం 10గ్రాములు, సైన్ధవలవణం 15గ్రాములు, తెల్ల మిరియాల పొడి 5గ్రాములు, అక్కలకర్ర పొడి 15గ్రాములు, మంజిష్ఠ పొడి 15గ్రాములు, పిప్పరమెంట్ ఆయిల్ లేదా స్పటికాలు 5గ్రాములు తీసుకొని బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో నిలువచేసుకొన వలెను. ఇదే పండ్ల పొడి.

ప్రయోగించు పద్దతి :- ఈ పండ్ల పొడితో ప్రతి రోజు రెండు పూటలా క్రమం తప్పకుండ పళ్లు తోముకొన వలెను.

ప్రయోజనములు :- అలా క్రమం తప్పక చేయుట వలన పండ్ల నుండి చీము, రక్తం కారడం, పిప్పిపండ్లు రావడం, పళ్ళుఊడిపోవడం, చిగుర్లవాపు ఇవన్నీ రెండు నెలల్లో సంపూర్ణంగా మాయమై పోయి పళ్ళు ముత్యాలవలె ధగధగ మెరుస్తుంటాయి. (పైన చెప్పిన దినుస్సులన్నీ మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదం షాపులలో లభిస్తాయి).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *